యాప్నగరం

Sheila Dikshit: కాంగ్రెస్ ప్రియ పుత్రిక ఇక లేరు.. రాహుల్, ప్రియాంక భావోద్వేగం

Delhi Ex CM | ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల కాంగ్రెస్ సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రియ పుత్రిక ఇక లేరంటూ రాహుల్ భావోద్వేేగానికి లోనయ్యారు.

Samayam Telugu 20 Jul 2019, 6:52 pm
కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తుదిశ్వాస విడిచారు. మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఆమె.. కేరళ గవర్నర్‌గానూ వ్యవహరించారు. 1984 నుంచి 89 వరకు ఐక్యరాజ్య సమితి మహిళ కమిషన్‌లో భారత్ ప్రతినిధిగా వ్యవహరించారు. మాజీ సీఎం మరణంతో ఢిల్లీలో రెండు రోజులు సంతాప దినాలు పాటించారు. షీలా దీక్షిత్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Samayam Telugu sheila dikshit


ఢిల్లీ అభివృద్ధికి షీలా దీక్షిత్ గణనీయమైన కృషి చేశారు. ఆమె మరణం తీవ్రంగా కలచి వేసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘షీలాదీక్షిత్ మృతి చెందారనే వార్త ఇప్పుడే విన్నాను. ఆమె మరణం ఢిల్లీ ప్రజలకు తీరని లోటు. ఆమె చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుంటాయి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాల’’ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

‘‘షీలా దీక్షిత్ మరణ వార్త కలచి వేసింది. కాంగ్రెస్ ప్రియ పుత్రిక అయిన ఆమెతో వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆమె నిస్వార్థంగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఢిల్లీ ప్రజలకు సానుభూతి వ్యక్తం తెలియజేస్తున్నాన’’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

‘‘ఢిల్లీ అభివృద్ధి కోసం షీలా దీక్షిత్ చేసిన అవిరాళ కృషి ఎప్పటికీ మర్చిపోలేం. ఆమె ఇచ్చే తెలివైన సలహాలను, తన అందమైన నవ్వును మిస్సవుతాను. ఎప్పుడు కలిసిన తను నన్ను ఆత్మీయంగా హత్తుకునేవార’’ని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.