యాప్నగరం

అధికారంలోకి వస్తే 5 లీటర్ల పెట్రోలు ఉచితమట

త్వరలో దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

TNN 23 Jan 2017, 7:42 pm
త్వరలో దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 4 నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కాగా ఎలాగైనా గెలిచి అధికారం పీఠం ఎక్కేందుకు పార్టీలు ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తున్నాయి. కాగా గోవా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా ఆధ్వర్యంలో మానిఫెస్టో విడుదల కార్యక్రమం సాగింది. అందులో ఓటు హక్కు ఉన్న విద్యార్థులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వినూత్నంగా పెట్రోలును ఆశగా చూపించింది.
Samayam Telugu congress promises free petrol to students in goa
అధికారంలోకి వస్తే 5 లీటర్ల పెట్రోలు ఉచితమట


పెట్రోలు ధరలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో దానినే ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని ఆలోచించింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే విద్యార్థులకు అయిదులీటర్ల చొప్పున పెట్రోలు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అలాగే ప్రజలకు మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించింది.

యూపీలో అఖిలేష్ యాదవ్ తాను అధికారంలోకి వస్తే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ప్రెషర్ కుక్కర్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.