యాప్నగరం

నిషేధించినా వెనక్కి తగ్గని ప్రతిపక్షం.. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించిన కేరళ కాంగ్రెస్‌

‘‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, కొన్ని నగరాల్లో దీనిని ప్రదర్శించగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయానికి మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొంటూ ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 27 Jan 2023, 7:40 am

ప్రధానాంశాలు:

  • మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ
  • తిరువనంతపురంలో ప్రదర్శించిన కాంగ్రెస్
  • జాదవ్‌పూర్ వర్సిటీలోనూ ప్రత్యేక ప్రదర్శన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu BBC Documentary
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. కేంద్రం నిషేధించినా ఈ డాక్యుమెంటరీని కేరళ కాంగ్రెస్‌ గురువారం ప్రదర్శించింది. ఇందుకోసం తిరువనంతపురంలోని షణ్ముగం బీచ్ వద్ద గురువారం పెద్ద స్క్రీన్‌ ఏర్పాటు చేసింది. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీ రాజకీయాల గురించి రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. కాగా, కేరళలోని కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండగా. అధికార సీపీఎం కూడా బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని వ్యతిరేకించింది.
అయితే, ఈ డాక్యుమెంటరీని ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోనీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ స్టాండ్‌ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ట్వీట్‌పై ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు రావడంతో ఏకంగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనిల్ ఆంటోనీ వాదనలపై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ఆయన వాదనలు పరికత్వలేనివని, డాక్యుమెంటరీ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం డాక్యుమెంటరీ ద్వారా ప్రభావితమయ్యేంత దుర్బలంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన వివాదస్పద బీబీసీ డాక్యుమెంటరీని కేరళ కాంగ్రెస్‌ ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని పలు చోట్ల ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలు నిరసనలు చేస్తున్నాయి. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీలోనూ గురువారం సాయంత్రం ఈ డాక్యుమెంటరీని సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ వీక్షించింది. దీనిని పోలీసులు కూడా అడ్డుకోలేదు.

డాక్యుమెంటరీ నిషేధంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జమ్మూలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘సత్యం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది.. దానికి బయటకు వచ్చే దుష్ట అలవాటు ఉంది. కాబట్టి ఎన్ని నిషేధాలు, అణచివేతలు, ప్రజలను భయపెట్టడం వంటివి నిజం బయటకు రాకుండా ఆపలేవు’’ అని ఆయన అన్నారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.