యాప్నగరం

అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో హరీష్ రావత్ విన్ - సుప్రీం

ఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష ఫలితాలను సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది.

TNN 11 May 2016, 1:21 pm
ఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం హరీష్ రావత్ నెగ్గినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మంగళవారం జరిగిన ఫ్లోర్ టెస్టు ఫలితాలకు సంబంధించిన సీల్ట్ కవర్ ను ఓపెన్ చేసి ఈ మేరకు బుధవారం ఫలితాలను ప్రకటించింది. మొత్తం 61 ఓట్లకు గాను 33 ఓట్లు హరీష్ రావత్ కు అనుకూలంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇదే సందర్భంగాలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన మరుక్షణమే హరీష్ రావత్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆ రాష్ట్ర గవర్నర్ కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు విన్న అటార్నీ జర్నల్ ముకుల్ రోహ్తగి కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తుందని కోర్టుకు తెలిపారు.
Samayam Telugu congresss harish rawat wins uttarakhand floor test bjp loses face
అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో హరీష్ రావత్ విన్ - సుప్రీం


కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. మరో వైపు బీజేపీ పాత తన వాదనే వినిపించింది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామంటూనే.. వాస్తవానికి రావత్ గెలుపు సాధించినప్పటికీ నైతికంగా తామే గెలిచామని వాదిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని వారికి ఓటు హక్కు కల్పించి ఉంటే హరీష్ రావత్ కుప్పకూలేదని బీజేపీ నేతలు వ్యాఖ్యనించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్ ఫలితాలు వెలువరించగానే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు సంభరాలు చేసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.