యాప్నగరం

Delhi High Court మైనర్ సమ్మతి చట్టం దృష్టిలో సమ్మతం కాదు.. హైకోర్టు కీలక తీర్పు

Delhi High Court మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వలలో వేసుకున్న వ్యక్తి.. ఆమె తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన 2019లో జరగ్గా.. బాలిక తండ్రి కేసు పెట్టాడు. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదయ్యింది. ఆమె సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు వాదించాడు. అయితే, అది చట్టం దృష్టిలో సమ్మతం కాదని నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా మార్చినట్లు గమనించింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 6 Dec 2022, 9:59 am

ప్రధానాంశాలు:

  • మైనర్ బాలికపై ప్రేమ పేరుతో అత్యాచారం
  • బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో నిందితుడు పిటిషన్
  • పోక్సో చట్టం కింద నిరాకరించిన న్యాయమూర్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu delhi high court
Delhi High Court మైనర్ సమ్మతి చట్టం దృష్టిలో సమ్మతి కాదని పేర్కొంటూ 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా మార్చినట్లు గమనించిన న్యాయస్థానం.. ఆధార్ కార్డ్‌లో అమ్మాయి పుట్టిన తేదీని మార్చడంలో వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. ‘‘బాలికతో శారీరక సంబంధం ఏర్పరుచుకుని ఆమె మైనర్ కాదని నమ్మించేందుకు దరఖాస్తుదారుడు (పురుషుడు) ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చడం ద్వారా ప్రయోజనం పొందాలని కోరుకున్నట్లు తెలుస్తోంది’’ అని పేర్కొంది.
‘‘ప్రత్యేకంగా పిటిషనర్ 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు సమ్మతి తెలిపిన మైనర్ బాలిక వయసు 16 ఏళ్లు.. అప్పటికే అతడికి వివామయ్యింది.. నిందితుడికి బెయిల్‌కు నిరాకరిస్తున్నాం.. మైనర్ సమ్మతి చట్టం దృష్టిలో సమ్మతి కాదు’’ అని జస్టిస్ జస్మీత్ సింగ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన కుమార్తె అదృశ్యమైనట్టు బాలిక తండ్రి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ యువకుడితో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. బాలికను తీసుకొచ్చారు.

అతడు తన ప్రియుడని నెలన్నర కలిసున్నామని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఆ వ్యక్తి తన అంగీకారంతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడని, తాను అతనితో కలిసి ఉండాలనుకుంటున్నానని ఆమె చెప్పింది. 2019 నుంచి కస్టడీలో ఉన్న నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు. ‘‘ప్రస్తుత కేసులో సంఘటన జరిగిన తేదీ నాటికి అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని నేను భావిస్తున్నాను.. దరఖాస్తుదారుడి వయస్సు 23 సంవత్సరాలు.. అప్పటికే వివాహితుడు. మైనర్‌ బాలిక సమ్మతంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది.. ఆధార్ కార్డులో ఆమె పుట్టిన తేదీని మార్చినట్టు గుర్తించాం.. వాస్తవంగా 2002లో జన్మిస్తే శారీరక సంబంధం ఏర్పరుచుకుని ఆమె మైనర్ కాదని చూపడానికి మార్చి 5, 2000గా మార్చారు’’ అని కోర్టు పేర్కొంది.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.