యాప్నగరం

‘అమ్మ’చుట్టు కుట్ర, మోదీ జోక్యం చేసుకోవాలి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చుట్టు కుట్ర జరుగుతుందని అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఆందోళన వ్యక్తం చేశారు.

Samayam Telugu 5 Dec 2016, 2:38 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చుట్టు కుట్ర జరుగుతుందని అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మ ఆరోగ్యంపై అపోలో వైద్యులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లను గుడ్డిగా నమ్మకూడదని...ఆమె ఆరోగ్యం విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని శశికళ కోరారు. జయలలిత ఆరోగ్య పర్యవేక్షణ, చికిత్స పూర్తిగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
Samayam Telugu conspiracy behind the custody of tn cm jayalalithaa alleges expelled mp sasikala
‘అమ్మ’చుట్టు కుట్ర, మోదీ జోక్యం చేసుకోవాలి


‘మంత్రులు కూడా ఆమెను కలవడం లేదు ఎందుకు? అమిత్ షా, రాహుల్ గాంధీలు (గత నెలలో) కూడా అపోలోకు వెళ్లినప్పుడు జయలిలతను చూడనివ్వలేదు. అమ్మ అపోలో ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 22 నుంచి పారదర్శకత లేదు. మేం కేవలం అపోలో ఆసుపత్రి వైద్యులను నమ్ముతున్నాం. ఆమె బతికి ఉన్నారా? లేక చనిపోయారా? అన్నది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని శశికళ అన్నారు.

రాజ్యాంగేతర శక్తుల ఆధీనంలో జయలలిత ఉన్నారని ఆరోపించిన శశికళ...అమ్మను కాపాడేందుకు పీఎం జోక్యం చేసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.