యాప్నగరం

జిన్నా ఫోటోపై రగడ..ఏఎంయూలో 144 సెక్షన్

యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో వాతావరణం వేడెక్కింది. పాక్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఫోటో పెట్టడంపై రెండు రోజులు క్రితం మొదలైన ఈ రగడ... ఇవాళ మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.

Samayam Telugu 4 May 2018, 6:59 pm
యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో వాతావరణం వేడెక్కింది. పాక్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఫోటో పెట్టడంపై రెండు రోజులు క్రితం మొదలైన ఈ రగడ... ఇవాళ మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ విద్యార్థి సంఘం క్లాసులు బహిష్కరించి నిరసనకు దిగడంతో ఉన్నట్టుండి సీన్ మారిపోయింది. విద్యార్థి సంఘాలు ఘర్షణకు దిగే అవకాశం ఉండటంతో... ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను వెంటనే రంగంలోకి దించి... 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అలాగే జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులతో రెండు రోజుల పాటూ ఇంటర్‌నెట్ సేవల్ని నిలిపివేశారు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో... 144 సెక్షన్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది.
Samayam Telugu Alighar


రెండు రోజుల క్రితం హిందూ యువ వాహినికి చెందిన కార్యకర్తలమంటూ కొంతమంది... వర్శిటీలోని ఓ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉన్న జిన్నా ఫోటోను తొలగించాలంటూ ఆందోళనకు దిగారు. వారిని మరో విద్యార్థి సంఘం అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... లాఠీఛార్జ్‌లో 40మంది విద్యార్థులు గాయపడ్డారట. అప్పటి నుంచి క్యాంపస్‌ నివురు గప్పిన నిప్పులా మారింది. అయితే మళ్లీ ఇవాళ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగడం, తర్వాతి పరిణామాలతో 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.