యాప్నగరం

మృతదేహం బ్యాగు తెరిచినందుకు.. 18 మందికి కరోనా పాజిటివ్

Coronavirus Cases: శ్మశానానికి తీసుకెళ్లి డెడ్​బాడీ ఉన్న బ్యాగును తెరిచారు. దీంతో బంధువుల్లో 18 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి సుమారు 100 మంది వరకూ హాజరు కావడం గమనార్హం.

Samayam Telugu 30 May 2020, 3:19 pm
కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రభుత్వాలు ఎంతో అవగాహన కల్పిస్తున్నా ఇంకా ఎంతో మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. దేశంలో రోజూ వేలాది కేసులు నమోదవుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనం. అక్కడి ఉల్లాస్‌ ‌నగర్‌లో ఇటీవల ఓ మహిళ (40) కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయింది. కొవిడ్ నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్ సిబ్బంది ఆ శవాన్ని బ్యాగులో ప్యాకింగ్ చేసి బంధువులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ బ్యాగును ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. ఆ విషయం పదే పదే సిబ్బంది బంధువులకు చెప్పినా వారు వినిపించుకోలేదు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Corona positive dead body


శ్మశానానికి తీసుకెళ్లి డెడ్బాడీ ఉన్న బ్యాగును తెరిచారు. దీంతో బంధువుల్లో 18 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి సుమారు 100 మంది వరకూ హాజరు కావడం గమనించదగ్గ విషయం. మృతురాలి అంత్యక్రియల తర్వాతి రోజే వచ్చిన ఆమె కరోనా పరీక్షల నివేదికలో పాజిటివ్‌గా తేలడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని ముందు క్వారంటైన్‌‌కు తరలించారు. అందులో 18 మందికి శుక్రవారం పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది.

దీంతో ఇప్పుడు మిగతావారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఉల్లాస్‌నగర్‌‌ మున్సిపల్‌ శాఖ సీనియర్‌ అధికారి మీడియాతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సంబంధిత బంధువులపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.