యాప్నగరం

2301కు చేరిన కరోనా కేసులు.. తబ్లీగి జమాత్‌తో సంబంధం ఉన్నవి 647: కేంద్రం

దేశంలో గత 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ 56మంది కరోనా కారణంగా చనిపోయారని తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 2301కి చేరగా.. వీటిలో 647 కేసులకు తబ్లీగి జమాత్‌తో సంబంధం ఉందని వెల్లడించింది.

Samayam Telugu 3 Apr 2020, 5:29 pm
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2301కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 336 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్ బారిన పడి 56 మంది ప్రాణాలు కోల్పోయారన్న ఆయన.. నిన్న ఒక్క రోజే 12 మంది చనిపోయారన్నారు. ఇప్పటి వరకూ 157 మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గత రెండు రోజుల్లో నమోదైన కరోనా కేసుల్లో 647 కేసులకు తబ్లీగి జమాత్‌తో సంబంధం ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
Samayam Telugu Lav Aggarwal


కరోనా వైరస్ గురించి కేంద్రం ప్రత్యేకంగా ఆరోగ్య సేతు యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకూ 30 లక్షల మంది ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు.

హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన తబ్లీగి జమాత్ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కేంద్ర హోం శాఖ కంట్రోల్ రూంలో ఇప్పటి వరకూ ఏడు హెల్ప్‌లైన్ నంబర్లు ఉండగా.. మరో రెండు హెల్ప్‌లైన్ నంబర్లను తీసుకొచ్చారు. 1930 అనేది ఆలిండియా టోల్ ఫ్రీ నంబర్ కాగా.. 1933 అనే నంబర్‌ను ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.