యాప్నగరం

కరోనాపై రేపు ఐసీఎంఆర్ కీలక ప్రకటన..! సామూహిక వ్యాప్తి దశకు చేరువగా..!

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ మంగళవారం కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

Samayam Telugu 23 Mar 2020, 2:19 pm
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 415కి చేరింది. జనవరి చివర్లో తొలి కేసు నమోదు కాగా.. మార్చి మొదటి వారం నుంచి కరోనా వ్యాప్తి తీవ్రమైంది. కేరళలో పాజిటివ్‌గా తేలిన ముగ్గురికీ తగ్గిపోయిన తర్వాత మార్చి 2న హైదరాబాద్, ఢిల్లీల్లో ఒక్కొక్కటి చొప్పున కోవిడ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అది మొదలు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే పోతోంది. నిన్న మొన్నటి వరకూ కోవిడ్ వ్యాప్తి మెల్లగా ఉండగా.. గత రెండు మూడు రోజుల్లోనే మనదేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయ్యింది.
Samayam Telugu corona


ఈ నేపథ్యంలో కరోనా సామూహిక వ్యాప్తికి దారి తీయకుండా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా, గుమికూడకుండా కట్టడి చేస్తున్నాయి. కోవిడ్ వైరస్ విషయమై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రోజూ మీడియాకు సమాచారం అందిస్తూనే ఉంది. కాగా ఈ కోవిడ్ వ్యాప్తి విషయమై మంగళవారం ఐసీఎంఆర్ కీలక సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాబోయే కొద్ది నెలల్లో ఎంత మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఐసీఎంఆర్ నిర్వహిస్తోన్న అధ్యయనం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కరోనా కేసులు 400 దాటడంతో.. భారత్‌ సమూహ వ్యాప్తి దశకు చేరిందేమో అని చాలా మంది భయపడుతున్నారు. కానీ భారత్ ఇప్పటి వరకూ ఈ దశకు చేరలేదు గానీ.. దీనికి సంబంధించిన కీలక విషయాలను ఐసీఎంఆర్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని ఎపిడమాలజిస్టుగా పని చేస్తున్న ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. మార్చి 23 వరకు 17,493 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.