యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: స్వీయ నిర్బంధంలో కేంద్ర మంత్రి.. ఆయన్ను కలవడమే కారణం

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. పార్లమెంట్ సమావేశాలు, పార్టీ సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

Samayam Telugu 17 Mar 2020, 2:45 pm
సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. కోవిడ్ భయాందోళనల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికే జంకుతున్నారు. కాగా కరోనా ప్రభావంతో కేంద్ర మంత్రి మురళీధరన్ ఢిల్లీలోని తన ఇంట్లో స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లిపోయారు. తిరువనంతపురంలో ఇటీవల తాను కలిసిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా లేదని తేలింది.
Samayam Telugu muraleedharan


ఐసోలేషన్‌లో ఉన్న మురళీధరన్... పార్లమెంట్‌కు వెళ్లడం లేదు. బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో కలిసి పని చేసిన 76 మంది వారి ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉంచారు.

భారత్‌లో మంగళవారం మధ్యాహ్నం వరకు 126 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనాను అరికట్టడం కోసం అప్ఘానిస్థాన్, ఫిలిప్పిన్స్, మలేసియా నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై కేంద్రం తక్షణ నిషేధం అమలు చేసింది. అంతకు ముందే యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ టేడ్ అసోసియేషన్, టర్కీ, యూకే తదితర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్ దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.