యాప్నగరం

లెటర్లలో కరోనా వైరస్ పార్శిల్.. దుండగుల కుట్ర, నిఘావర్గాల వార్నింగ్!

Interpol: కరోనా యోధులు మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తుంటే దుండగులు వైరస్ వ్యాప్తికి కుట్రలు చేస్తున్నారు. లెటర్లు, పార్శిళ్ల ద్వారా ప్రముఖులు, రాజకీయ నాయకులకు వైరస్ అంటించే ప్రమాదం ఉందని ఇంటర్‌పోల్ హెచ్చరించింది.

Samayam Telugu 23 Nov 2020, 3:42 pm
రోనా వైరస్‌తో కొత్త సంక్షోభం ముంచుకొచ్చింది. ఈ మహమ్మారితో వైద్య, ఆరోగ్య సిబ్బంది ఓ వైపు యోధుల్లా పోరాటం చేస్తుంటే.. మరో వైపు కొంత మంది దుర్మార్గులు వైరస్‌ను వ్యాప్తి చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. కరోనా వైరస్‌తో కలుషితం చేసిన లేఖలను, పార్శిళ్లను (Coronavirus infected letters) పంపించడానికి కుట్రలు చేస్తున్నారు. పోలీసులు, నిఘా, భద్రతా అధికారులు, డాక్టర్లకు సమీపంగా వెళ్లి వారి మీద తుంపర్లు పడేలా తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు. ఇలాంటి కుట్రలను గుర్తించిన ఇంటర్‌పోల్ (International Criminal Police Organisation) తాజాగా అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. కీలక సూచనలు చేసింది.
Samayam Telugu వైరస్ ఇన్‌ఫెక్టెడ్ లెటర్లు (ప్రతీకాత్మక చిత్రం)
Covid Contaminated Letters Could Be Threat For Political Figures, Warns Interpol


Must Read: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. మోదీ ఉన్నతస్థాయి సమీక్ష, జవాన్లకు ప్రశంసలు

వివిధ రంగాల్లో ప్రముఖులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని కరోనా వైరస్‌తో కలుషితం చేసిన లేఖలను పంపే ప్రమాదం ఉందని ఇంటర్‌పోల్‌ హెచ్చరించింది. కొంత మంది దుండగులు కావాలనే డాక్టర్లు, తనిఖీ, నిఘా అధికారులు, పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బంది ముఖంపై ఉమ్మడం, దగ్గడం చేస్తున్నారని ఇంటర్‌పోల్‌ తెలిపింది. పలు దేశాల్లో ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. ఉగ్రవాదులు, దుండగులు ఇలాంటి కుట్రలు జరుపుతున్నారని తెలిపింది.

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే వస్తువులు, లేఖల ఉపరితలాలపై కొంత మంది దుండగులు కావాలనే ఉమ్మడం, దగ్గడం చేస్తున్నారని.. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఇంటర్‌పోల్‌ తెలిపింది. పోస్టల్ సిబ్బందికి ఈ అంశంపై అవగాహన కల్పించాలని కోరింది. అనుమానిత పార్శిళ్లను క్షుణ్నంగా తనిఖీ చేయాలని, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ప్రముఖులకు భద్రత కల్పించే సిబ్బంది వీటిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపింది.

‘ఇది ప్రమాదకరమైన విషయం. ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పోలీసు శాఖతో పాటు సీబీఐ, సీఐడీ, లాంటి సంస్థలు, సైబర్‌ క్రైం, ఉగ్రవాద నిరోధక సంస్థలు అలర్ట్‌గా ఉండాలి.’ అని Interpol సూచించింది. 194 సభ్యదేశాలకు సూచనలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

Must Read: IAS టాపర్ల ప్రేమ బంధానికి బీటలు.. కలిసి బతకలేకపోయారు!

Also Read: Covaxin మూడో దశ ట్రయల్స్: ఆరోగ్య మంత్రికి తొలి డోసు.. త్వరలో గుడ్ న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.