యాప్నగరం

‘రాష్ట్రపతి’ ఓట్ల లెక్కింపు ప్రారంభం

భారత 14వ రాష్ట్రపతి ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రారంభమైంది.

TNN 20 Jul 2017, 1:29 pm
భారత 14వ రాష్ట్రపతి ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. మొదటిగా పార్లమెంట్‌ భవనంలో ఎంపీలు ఓట్లు వేసిన బ్యాలెట్‌ పెట్టెను, తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి ఓట్లు లెక్కించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనూప్‌ మిశ్రా చెప్పారు.
Samayam Telugu counting of votes for presidential poll 2017 begins
‘రాష్ట్రపతి’ ఓట్ల లెక్కింపు ప్రారంభం

#Visuals Counting of votes for #PresidentialPoll2017 begins in Parliament pic.twitter.com/ffzK0u34CB — ANI (@ANI_news) July 20, 2017
కాగా, ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని ఇప్పటికే అందరూ భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఆయన స్థానంలో నేటి ఫలితాల్లో విజయం సాధించే అభ్యర్థి రాష్ట్రపతి భవన్‌లో 14వ రాష్ట్రపతిగా అడుగుపెడతారు. కోవింద్‌ గెలుపు లాంఛనమే అయినప్పటికీ.. ఎంత మెజార్టీతో గెలుస్తారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.