యాప్నగరం

నాటుబాంబు తిని ఆవు మృతి.. గాయంతో రెండ్రోజులు నరకయాతన

Coimbatore: నాటుబాంబు తిని తీవ్రంగా గాయపడిన ఆవు ప్రాణాలతో పోరాడుతూ కన్నుమూసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 19 Aug 2020, 12:27 am
కేరళలో ఏనుగు మృతి తరహాలోనే తమిళనాడులో మరో ఘటన చోటు చేసుకుంది. నాటుబాంబును తిని ఆవు మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆ ఆవు రెండు రోజులు నరకయాతన అనుభవించింది. ఆవును కాపడటానికి వెటర్నరీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో మెట్టుపాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఆవు కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తే పోలీసులు తననే అనుమానిస్తున్నారని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
Samayam Telugu నాటుబాంబు తిని ఆవు మృతి
Cow dies after biting crude bomb in Coimbatore


మొహమ్మద్ జాఫర్‌ అలీ అనే రైతు తన ఆవు రెండు రోజులుగా కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. ఈలోగా ఊరిబయట ఓ ఆవు కనిపించినట్లు అతడికి సమాచారం అందింది. దాని దగ్గరికి వెళ్లి చూడగా నోటి నిండా గాయాలతో రక్తమోడుతూ తీవ్ర అనారోగ్యానికి గురై ఉంది. వెంటనే దాన్ని చికిత్స నిమిత్తం స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లినట్లు రైతు జాఫర్ అలీ తెలిపాడు.

చికిత్స తర్వాత ఆవు ఏమాత్రం కోలుకోలేదు. సోమవారం (ఆగస్టు 17) రాత్రి చనిపోయింది. అయితే.. ఆ ఆవును తానే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని జాఫర్ అలీ తెలిపాడు. జింకను వేటాడిన కేసులో పదేళ్ల కిందట తనకు జరినామా విధించారని.. ఇప్పుడు తన ఆవు మరణానికి కారణమైన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు.

కోయంబత్తూర్ ఆవు


Photo: P Sreedharan

ఘటనపై మెట్టుపాలయం అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు రైతు జాఫర్‌ అలీ తెలిపాడు. ఘటనపై విచారణ చేపట్టినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్ తెలిపారు. అడవి పందులను చంపడానికి పెట్టిన నాటుబాంబులు తిని ఆవు గాయపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ వేటగాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. కర్ణాటకలోని మైసూరులోనూ గత నెలలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. హెచ్‌డీ కోటే సమీపంలో ఓ రైతుకు చెందిన ఆవు.. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు తిని గాయపడింది.

Also Read: రోడ్లపై పడిపోయి నిద్ర.. జపాన్‌లో మాయ రోగం!

Must Read: వదినపై ప్రేమతో అన్న ఆత్మహత్య.. అది తట్టుకోలేక చెల్లి సూసైడ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.