యాప్నగరం

దాన్ని నేరంగా గుర్తిస్తే.. వివాహ వ్యవస్థకే ప్రమాదం: కేంద్రం

వైవాహిక అత్యాచారం (మారిటల్‌ రేప్‌ )ను నేరంగా పరిగణించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుసరించబోమని స్పష్టం చేసింది. 'భారత్‌లో మారిటల్‌ రేప్‌‌ను..

TNN 29 Aug 2017, 8:01 pm
వైవాహిక అత్యాచారం (మారిటల్‌ రేప్‌)ను నేరంగా పరిగణించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుసరించబోమని స్పష్టం చేసింది. 'భారత్‌లో మారిటల్‌ రేప్‌‌ను నేరంగా పరిగణించలేం. దేశంలో ఉన్న నిరక్షరాస్యత, మెజారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, సమాజ దృష్టికోణం, పేదరికం, విభిన్నత లాంటి అనేక సమస్యల దృష్ట్యా దీన్ని నేరంగా గుర్తించడం కష్టసాధ్యం' అని కేంద్రం పేర్కొంది.
Samayam Telugu criminalising marital rape may destabilise institution of marriage centre
దాన్ని నేరంగా గుర్తిస్తే.. వివాహ వ్యవస్థకే ప్రమాదం: కేంద్రం


భార్య వయసు 15 నుంచి 18 ఏళ్ల లోపు ఉంటే ఆమెతో భర్త శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని అనుమతించడంలో రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా.. సంబంధిత అంశాలపై వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. 15-18 ఏళ్ల మధ్య వయసులోని వివాహిత బాలికలను వారి భర్తల బలవంతపు శృంగార చర్యల నుంచి రక్షించే అంశాన్ని పార్లమెంటు చర్చించిందా.. అలాంటి బాలికల హక్కుల్ని పరిరక్షించడంలో కోర్టు జోక్యం చేసుకోగలుగుతుందా.. అనే అంశాలపై వివరణ తెలపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆగస్టు 9న ఆదేశించింది.

ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ మోనికా అరోరా.. ఢిల్లీ హైకోర్టులో మంగళవారం (ఆగస్టు 29) అఫిడవిట్‌ దాఖలు చేశారు. ట్రిపుల్‌ తలాక్ విషయంలో మహిళలకు అనుకూల వైఖరి తీసుకున్న కేంద్రం.. ఈ విషయంలోనూ అదే తీరు కనబరుస్తుందని చాలా మంది భావించారు. మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించడం లింగ సమానత్వంలో మరో కీలక ముందడుగుగా మహిళలు భావించారు. కానీ కేంద్రం ఈ విషయంలో భిన్నమైన వైఖరిని తీసుకుంది.

మారిటల్‌ రేప్‌‌ను నేరంగా పరిగణిస్తే.. అది వివాహ వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం కూడా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ విషయంలో సాక్ష్యాలను గుర్తించడం ప్రధాన సమస్యగా మారుతుందని తెలిపింది.

‘వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే ముందు.. ఏది మారిటల్‌ రేప్‌, ఏది నాన్‌ మారిటల్‌ రేప్‌ అనే అంశాన్ని స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. ఒక వ్యక్తి తన భార్యతో చేసే శృంగార చర్యలన్నీ మారిటల్‌ రేప్‌ కింద పరిగణిస్తే.. ఏకపక్షంగా భార్య చెప్పిన విషయాల ఆధారంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది' అని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

Also Read: భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే నేరం అవుతుందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.