యాప్నగరం

Burevi: దూసుకొస్తున్న బురేవి తుఫాన్.. హెచ్చరికలు జారీ

Tamil Nadu Rains: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడింది. బుధవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Samayam Telugu 1 Dec 2020, 6:21 pm
నివర్ తుఫాన్ చేసిన బీభత్సం మరచిపోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం (డిసెంబర్ 2) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం, గురువారం తమిళనాడు, కేరళతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Samayam Telugu నమూనా చిత్రం
Tamil Nadu Cyclone


ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమైలకు 710 కి.మీ. దూరంలో, తమిళనాడులోని కన్యాకుమారికి 1120 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఇది బుధవారం సాయంత్రం శ్రీలంక తీరాన్ని తాకనుంది. ఈ తుఫాన్‌కు ‘బురేవి’గా నామకరణం చేయనున్నారు.

Don't Miss: తుఫాన్: కార్లు కొట్టుకుపోకుండా ఇలా పార్క్ చేశారు.. సేఫ్ ప్లేస్!

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 55-65 వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బురేవి తుఫాన్ కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కన్యాకుమారి ప్రాంతంపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

తుఫాన్ తీరం వైపు తరలివస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. డిసెంబరు 1 నుంచి మత్స్యకారులెవరూ బంగాళఖాతంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు.

Also Read: కొంప ముంచిన పొగమంచు.. 13 మంది సజీవదహనం

Must Read: మారడోనా ఆస్తి 700 కోట్లు.. ఏ ప్రేయసి పిల్లలకు వెళ్తుంది?

Also Read: కోతుల దాడి.. మహిళ మృతి, సూర్యాపేటలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.