యాప్నగరం

వార్ధా తుపాను: ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం

‘వార్ధా’ తుపాను ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో అని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

TNN 12 Dec 2016, 2:26 pm
దూసుకొస్తున్న ‘ వార్ధా’ తుపాను ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో అని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ ప్రభుత్వాలు తమ అధికారులను అప్రమత్తం చేశాయి. కాగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు మూడు రాష్ట్రాల్లోనూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇప్పటికే ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలోని తుపాను ప్రభావిత ప్రాంతాలకు బృందాలను పంపించామని ఆయన తెలిపారు. చెన్నైకి మూడు బృందాలు, తిరువళ్లూరుకు రెండు బృందాలు, కాంచీపురానికి రెండు బృందాలు, పుదుచ్చేరికి, విశాఖపట్నానికి, గుంటూరుకు ఒక్కో బృందాన్ని పంపించినట్టు చెప్పారు.
Samayam Telugu cyclone vardah ndrf closely monitoring situation
వార్ధా తుపాను: ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం


అలాగే అరక్కోణం ప్రాంతాల్లో బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని... ఎక్కడ అవసరమైతే ఆ ప్రాంతాలకు సమాచారం అందిన వెంటనే బయలుదేరుతాయని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంతో తాము ఎల్లప్పుడు టచ్ లో ఉంటున్నామని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.