యాప్నగరం

దాద్రి నిందితుడి అనుమానాస్పద మృతి

అఖ్లాక్ హత్యలో నిందితుల్లో ఒకరు అనుమనాస్పదంగా మరణించారు.

TNN 5 Oct 2016, 12:45 pm
గతేడాది యూపీలోని దాద్రి తాలూకా బిసాదా గ్రామంలో ఆవును చంపాడన్న కారణంగా మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని కొంతమంది కొట్టి చంపారు. అఖ్లాక్ కొడుకును కూడా తీవ్రంగా గాయపరిచారు. ఇందులో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరు రాబిన్ (22). ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత అతడిని అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడా లోని లష్కర్ జైల్లో ఉంచారు. కాగా నాలుగు రోజులుగా అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ జ్వరం డెంగీ లేదా చికెన్ గున్యా కావొచ్చని అన్నారు. మంగళవారం ఉదయం పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సాయంత్రం ఆరు గంటల సమయంలో రాబిన్ మరణించాడు. కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేయడం ఆపేయడంతో అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. కాగా రాబిన్ తల్లి నిర్మల తన కొడుకుని పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. రాబిన్ కు భార్య, ఆరునెలల పాప ఉందని చెప్పారు.
Samayam Telugu dadri lynching suspect rabin dies
దాద్రి నిందితుడి అనుమానాస్పద మృతి


జిల్లా మెజిస్ట్రేట్ ఎన్‌పీ సింగ్ ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా జైలు సూపరిటెండెంట్ ను ఆదేశించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. నిజాలు నిగ్గుతేల్చేందుకు కమిటీని వేశాం’ అని తెలిపారు. ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరిటెండెంట్ మాట్లాడుతూ ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే రాబిన్ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. తామెంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని కొన్ని గంటలకే చనిపోయాడని తెలిపారు. రాబిన్ రక్త నమూనాలను పరీక్షల కోసం పంపామని ఆ రిపోర్టులు వస్తేనే డెంగీ జ్వరమా, చికెన్ గున్యా అనేది తెలుస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.