యాప్నగరం

వీడియో: ఇళ్లలోకి విష సర్పాలు.. కేరళలో స్నేక్ అలర్ట్

వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత కేరళ వాసుల ఇళ్లలోకి విష సర్పాలు యథేచ్ఛగా వచ్చేస్తుండటంతో.. పాము కాట్లు పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రంలో స్నేక్ అలర్ట్ ప్రకటించారు.

Samayam Telugu 25 Aug 2018, 1:23 pm
వరదలు తగ్గుముఖం పట్టడంతో కేరళలో జనజీవనం మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ప్రజలు ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగిస్తూ.. శుభ్రం చేసుకుంటున్నారు. వరదలు తగ్గినా.. జనాల్ని పాముల బెడద వేధిస్తోంది. ఇళ్లలోకి విష సర్పాలు ప్రవేశించడంతో జనం భయ భ్రాంతులకు లోనవుతున్నారు. ఒక ఇంట్లోకి కొండ చిలువ ప్రవేశించగా.. మరో ఇంట్లో బెడ్ మీద రెండు భారీ తాచుపాములు కనిపించడంతో జనాలు షాకయ్యారు. స్నేక్ ఎక్స్‌పర్ట్‌లు పాములను పట్టుకుని సమీప అటవీ ప్రాంతాల్లో వదులుతున్నారు.
Samayam Telugu kerala snakes


వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత కేరళలో పాము కాట్లు పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రంలో స్నేక్ అలర్ట్ ప్రకటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో యాంటీ వీనంతోపాటు ఇతర మందులను అందుబాటులో ఉంచుతున్నారు.
ఇళ్లలోని వార్డ్ రోబ్‌లు, కిచెన్, కప్ బోర్డులు, కార్పెట్లు, వాషింగ్ మెషీన్లు, దుస్తులలో పాములు దాగి ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలయాళ మీడియా సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.