యాప్నగరం

దీపను ముఖ్యమంత్రిగా చేస్తానన్న మాధవన్!

దీప పోటీ చేస్తుందని, జయలలితకు వారసురాలు తనే అని, ఆమె విజయం సాధించడం ఖాయమని మాధవన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

TNN 21 Mar 2017, 9:58 am
మొన్నేమో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాను.. ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ హడావుడి చేసిన జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ భర్త మాధవన్ అప్పుడే మాట మార్చాడు. తన భార్య దీపాను ఎమ్మెల్యేగా గెలిపించే వరకూ విశ్రమించేది లేదని ప్రకటించాడితను. తనకూ దీపకు మనస్పర్థలు లేవని.. ఇవన్నీ గిట్టని వారు కల్పించినవే అని మాధవన్ ప్రకటించాడు.
Samayam Telugu deepa husband supports her
దీపను ముఖ్యమంత్రిగా చేస్తానన్న మాధవన్!


ఆర్కే నగర్ నుంచి దీప పోటీ చేస్తుందని, జయలలితకు వారసురాలు తనే అని, ఆమె విజయం సాధించడం ఖాయమని మాధవన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. త్వరలోనే తమ పార్టీ పేరును , గుర్తును ప్రకటిస్తామని.. అమ్మ పాలనను అందించడమే తమ అజెండా అని మాధవన్ ప్రకటించాడు.

జయలలిత సమాధిని సందర్శించి.. ఆమెకు నివాళి ఘటించిన మాధవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటనలు చేశాడు. తనకు కొత్త పార్టీ ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశాడు. దీపను ఎమ్మెల్యేగా గెలిపించి, అటుపై ముఖ్యమంత్రి గా చేస్తానని చెప్పుకొచ్చాడు. మరోవైపు జయ మరణానంతరం దీప వెంట నిలిచిన కొంతమంది నేతల్లో విబేధాలు తీవ్రం అయ్యాయి. వీరిలో కొందరు పన్నీరు సెల్వం వర్గం వైపు వెళ్లిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.