యాప్నగరం

ఆ ఎంపీల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలి: సాయి రెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు

Samayam Telugu 4 Aug 2018, 7:46 am
పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.శుక్ర‌వారం ఆయన ఢిల్లీలో లోక్‌స‌భ స్పీకరును కలిసి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున ఎస్పీవై. రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుకలు గెలిచారు. ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ ఫిరాయించారు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ లోకి ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని లేఖలో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Samayam Telugu లోక్స‌భ స్పీకరుకు ఫిర్యాదు చేసిన సాయి రెడ్డి


''పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని చాలాకాలం కిందటే మేము ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకు కూడా ఫిర్యాదులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుంటే రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రమాదమ‌ని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మరింత మంది పార్టీ ఫిరాయించే అవకాశం కనబడుతోంది. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన శరద్ యాదవ్, అన్వర్ అలీలపై 90 రోజులలో అనర్హత వేటు వేశారు. అదే పద్ధతిలో లోక్ సభలో కూడా ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాల''ని ఆయన లేఖలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.