యాప్నగరం

రష్యా పర్యటనకు రక్షణ శాఖా మంత్రి..

భారత రక్షణ, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి అరుణ్ జైట్లీ జూన్ 21 నుంచి 23 వరకు రష్యాలో..

TNN 19 Jun 2017, 5:23 pm
భారత రక్షణ, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి అరుణ్ జైట్లీ జూన్ 21 నుంచి 23 వరకు రష్యాలో పర్యటించనున్నారు. జైట్లీ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి బృందం రష్యాకు వెళ్లనున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. జూన్ 21న జైట్లీ బృందం.. రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దిమిత్రి రోగోజిన్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా.. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఇండియా-రష్యాకు చెందిన ఉన్నత స్థాయి బృందం మొదటిసారిగా భేటీ అవుతుంది. టెక్నోప్రోమ్‌కు సంబంధించి ఏర్పాటు చేసే ప్లీనరీ సెషన్లో భారత రక్షణ శాఖా మంత్రి ప్రత్యేకంగా ప్రసంగిస్తారు.
Samayam Telugu defence minister arun jaitley to russia visit
రష్యా పర్యటనకు రక్షణ శాఖా మంత్రి..


జూన్ 23న అరుణ్ జైట్లీ మాస్కోలో.. ‘ఇండియా - రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ కోపరేషన్’ 17వ సమావేశంలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య మిలటరీ సహకారంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇండియా - రష్యా మధ్య మిలటరీ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.