యాప్నగరం

మేం అప్రమత్తంగానే ఉన్నాం: నిర్మలా సీతారామన్‌

దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామని రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. డోక్లామ్‌ సరిహద్దు వద్ద ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సర్వసిద్ధమని తెలిపారు.

Samayam Telugu 25 Mar 2018, 9:08 pm
Samayam Telugu Nirmala
నిర్మలా సీతారామన్
దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామని రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆదివారం (మార్చి 25) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. డోక్లామ్‌ సరిహద్దు వద్ద ఎలాంటి ఊహించని పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు భారత్‌ సర్వసిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దు వెంట యథాతథ స్థితిలో ఎలాంటి మార్పులు చేసినా.. మరో డోక్లామ్‌ తరహా సంక్షోభం తప్పదని భారత రాయబారి గౌతమ్‌ బాంబవాలే హెచ్చరించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మేం అప్రమత్తంగానే ఉన్నాం. డోక్లామ్‌ వద్ద ఊహించని పరిస్థితులు ఎదురైతే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా దళాల ఆధునికీకరణ కోసం కృషి చేస్తున్నాం. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం’ అని నిర్మల అన్నారు. చైనా సైన్యం డోక్లామ్‌ సమీపంలో తన బలగాలను పెంచుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో భారత రాయబారి గౌతమ్‌ చేసిన హెచ్చరికలు పరోక్షంగా ఆమె సమాధానం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.