యాప్నగరం

మెట్రో ఎక్కాడు.. ముహూర్తానికి తాళి కట్టాడు

ఓ పక్క పెళ్లికి ముహూర్తం దగ్గరపడుతోంది. వరుడేమో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. ఇక పెళ్లి ఆలస్యంకాక తప్పదేమో అనుకుంటున్న సమయంలో.. మెట్రో వారికి వరంలా మారింది.

TNN 30 Dec 2017, 4:57 pm
కొచ్చిన్ మెట్రో సాయంతో కేరళకు చెందిన ఓ జంట సకాలంలో ఏకమైంది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి.. ఇక పెళ్లి ఆలస్యం అవడం తప్పదు అనుకుంటున్న సమయంలో.. మెట్రో ఉండటం పెళ్లి వారికి కలిసొచ్చింది. వెంటనే వాహనాలు దిగిపోయి.. మెట్రో ఎక్కి సకాలంలో కళ్యాణ మండపానికి వెళ్లిపోయారు. ముహూర్తానికి పెళ్లి జరగడంతో మెట్రోకి థ్యాంక్స్ చెబుతున్నారు.
Samayam Telugu delayed by traffic groom takes kochi metro to his wedding
మెట్రో ఎక్కాడు.. ముహూర్తానికి తాళి కట్టాడు


పాలక్కడ్‌కు చెందిన రంజిత్ కుమార్ ఎర్నాకుళంకు చెందిన ధన్యతో డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఇరు పట్టణాల మధ్య దూరం 130 కి.మీ. మామూలుగా అయితే మూడు గంటల్లో వెళ్లిపోవచ్చు. అదే అంచనాతో ఉదయం ఆరు గంటలకు మగపెళ్లి వారు బయల్దేరారు. కానీ క్రిస్మస్ సెలవులు కావడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. వంద కి.మీ. ప్రయాణించే సరికి ఇక ముహూర్తం దాటిపోతుందని భయపడ్డారు.

షార్ట్‌కట్‌ల కోసం అడుగుతుంటే.. మెట్రో ఎక్కి వెళ్లమని ఎవరో సలహా ఇచ్చారు. వెంటనే సమీపంలోని అలువా మెట్రో స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ కూడా పొడవైన క్యూ ఉంది. కానీ వారికి తమ పరిస్థితి వివరించి పెళ్లి వాళ్లమని బతిమాలుకొని టికెట్లు కొనుక్కున్నారు. వెంటనే రైలెక్కి సమయానికి వెళ్లి పెళ్లి తంతు ముగించారు.


మొత్తానికి మెట్రో కారణంగా ముహూర్తానికి పెళ్లి చేసుకోగలిగారు. నవ దంపతులతో కొచ్చిన్ మెట్రో ఓ వీడియో రిలీజ్ చేసింది. ముహూర్తం టైం దాటిపోకుండా.. సాయం చేసిన మెట్రోకు కొత్త జంట థ్యాంక్స్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.