యాప్నగరం

సీఎం కారు దొరికిందోచ్..!

చోరీకి గురైన.. కేజ్రీవాల్‌ కారు దొరికింది. శనివారం (అక్టోబర్ 14) ఘజియాబాద్‌లోని మోహన్‌‌నగర్‌ సమీపంలో ఢిల్లీ సీఎం కారును పోలీసులు గుర్తించారు. అయితే.. కారు దొంగిల విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అరవింద్ కేజ్రీవాల్‌‌కు చెందిన నీలం రంగు వ్యాగన్‌-ఆర్‌ కారు రెండు రోజల కిందట అపహరణకు గురైన విషయం తెలిసిందే.

TNN 14 Oct 2017, 12:09 pm
చోరీకి గురైన.. కేజ్రీవాల్‌ కారు దొరికింది. శనివారం (అక్టోబర్ 14) ఘజియాబాద్‌లోని మోహన్‌‌నగర్‌ సమీపంలో ఢిల్లీ సీఎం కారును పోలీసులు గుర్తించారు. అయితే.. కారు దొంగిల విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అరవింద్ కేజ్రీవాల్‌‌కు చెందిన నీలం రంగు వ్యాగన్‌-ఆర్‌ కారు రెండు రోజల కిందట అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఏకంగా సచివాలయం ఎదుట నుంచే దుండగులు కారును అపహరించుకుపోయారు. కారు అపహరణపై సీఎం కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించడం గమనార్హం. ఈ విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Samayam Telugu delhi cm kejriwals stolen blue wagonr car recovered
సీఎం కారు దొరికిందోచ్..!


‘సీఎం కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి పరిస్థితేంటి? కారు పోవడం చిన్న విషయమే కావొచ్చు.. కానీ, అది సచివాలయం ఎదుట పోయింది. ఢిల్లీలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ’ అంటూ కేజ్రీవాల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌కు లేఖ రాశారు.

2013లో కుందర్‌ శర్మ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సదరు కారును కేజ్రీవాల్‌కు విరాళంగా ఇచ్చారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ ఆ కారునే వినియోగించారు. సీఎం కారును అపహరించిన నిందితులను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.