యాప్నగరం

బర్త్ డే పార్టీ ఇచ్చిన ఢిల్లీ కరోనా పేషెంట్.. పాల్గొన్న విద్యార్థులు, స్కూల్ బంద్!

హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడికి, ఢిల్లీకి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నిర్ధారణ కాక ముందు వీరు ఎవరెవర్ని కలిశారనే దిశగా వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు దుబాయ్ నుంచి బెంగళూరు విమానంలో వచ్చి.. అక్కడి నుంచి బస్సులో భాగ్యనగరం వచ్చాడు. తర్వాత కూడా హైదరాబాద్‌లో సన్నిహితులను కలిశాడు. ఫిబ్రవరి 27 నుంచి అతడు ఎవరెవర్ని కలిశాడనే వివరాలు సేకరించి వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 3 Mar 2020, 4:28 pm

Samayam Telugu delhi coronavirus patient gives birthday party many children present reports
బర్త్ డే పార్టీ ఇచ్చిన ఢిల్లీ కరోనా పేషెంట్.. పాల్గొన్న విద్యార్థులు, స్కూల్ బంద్!

బర్త్ డే పార్టీ ఇచ్చిన కరోనా పేషెంట్

ఇక ఢిల్లీలో నమోదైన కరోనా కేసు విషయంలో దిగ్భ్రాంతి గొలిపే వార్త ఒకటి వెలుగు చూసింది. మయూర్ విహార్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకగా.. వ్యాధి నిర్ధారణ కాక ముందు అతడు శుక్రవారం నోయిడాలో బర్త్ డే పార్టీ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ పార్టీలో అతడి పిల్లలతోపాటు వారి స్నేహితులు, కొందరు తల్లిదండ్రులు, టీచర్లు కూడా పాల్గొన్నారని వార్తలొస్తున్నాయి.

ఆ రోజే తేలింది!

శుక్రవారం రోజే అతడికి కరోనా సోకిందని నిర్ధారించారని తెలుస్తోంది. కరోనా పేషెంట్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారితో ఆరోగ్య శాఖ టచ్‌లో ఉంది. వారిని 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని సూచించినట్లు సమాచారం. నోయిడాలోని స్కూల్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించింది. అతడు కలిసిన వారిలో ఇప్పటి వరకూ ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదు. కొందరికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులు బుధవారంలోగా వచ్చే అవకాశం ఉంది.

స్కూల్ బంద్

ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని తేలడంతో.. అతడి పిల్లలు చదువుతున్న పాఠశాలకు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. పరీక్షలను కూడా వాయిదా వేశారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆ స్కూల్‌తో సంబంధం ఉన్న 40 మందికి పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు.

ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ ఎందుకు చేయలేదంటే?

కరోనా సోకిన వ్యక్తి ఇటలీ వెళ్లొచ్చారు. కానీ ఆయన ఆస్ట్రియా మీదుగా భారత్ రావడంతో.. ఢిల్లీ విమానాశ్రయంలో అతడికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదు. ఫిబ్రవరి 25న అతడు వచ్చిన ఎయిరిండియా విమాన సిబ్బందిని కూడా 14 రోజులపాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.

Also Read: కరోనా లక్షణాలతో మరో ముగ్గురు.. అపోలో సిబ్బంది కూడా గాంధీకి తరలింపు

కరోనా లక్షణాలివీ..

కరోనా సోకిన వ్యక్తిలో దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. గొంతు నొప్పి, కండరాల నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.

Must Read: హైదరాబాద్: కరోనా సోకిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో పరీక్షలు ఎందుకు చేయలేదంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.