యాప్నగరం

ఢిల్లీ అగ్నిప్రమాదం: అక్రమ గోదాం.. 17 మంది అమాయకులు సజీవదహనం

ఢిల్లీలోని బవానా టపాసుల కర్మాగారంలో జనవరి 20న సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో 17 మంది సజీవ దహనమయ్యారు.

TNN 21 Jan 2018, 3:51 pm
దేశ రాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో టపాసుల కర్మాగారంలో శనివారం సాయంత్రం (జనవరి 20) సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంటలు ఎగిసిపడి 17 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu delhi fire at illegal cracker factory kills 10 women 7 men
ఢిల్లీ అగ్నిప్రమాదం: అక్రమ గోదాం.. 17 మంది అమాయకులు సజీవదహనం


బవానా ప్రాంతంలో సదరు బాణసంచా గోదాంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, భవనం పైఅంతస్తులో ఉన్న రబ్బరు ఫ్యాక్టరీలోకి విస్తరించడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది.

ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ వ్యక్తి రెండో అంతస్తు నుంచి కిందకి దూకేశాడు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మృతుల కుటుంబాలకు సీఎం కేజ్రీవాల్ రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.