యాప్నగరం

Nirbhaya Case: కేంద్రానికి షాకిచ్చినా.. దోషులకు చెక్ పెట్టేలా హైకోర్టు తీర్పు

నిర్భయ దోషులను ఉరి తీయడం కోసం కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టడానికి సమ్మతించలేదు.

Samayam Telugu 5 Feb 2020, 3:21 pm
నిర్భయ దోషుల ఉరి శిక్షపై స్టే విధిస్తూ పాటియాలా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు. నలుగురు దోషులను ఉరి తీయాలని కేంద్రం పిటీషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వ వినతిని తిరస్కరించింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయాలని.. వేర్వేరుగా ఉరితీయడం కోసం డెత్ వారంట్ జారీ చేయడం సాధ్యపడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయపరంగా తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవడం కోసం ఢిల్లీ హైకోర్టు దోషులకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఆ తర్వాత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Samayam Telugu nirbhaya convicts


కోర్టు తీర్పు ప్రకారం వారం రోజుల తర్వాత నిర్భయ దోషులకు డెత్ వారంట్ జారీ చేసే అవకాశం ఉంది. దోషులు సహనాన్ని పరీక్షిస్తున్నారని, శిక్ష అమలు జాప్యానికి ప్రయత్నిస్తున్నారన్న వాదనతో న్యాయస్థానం అంగీకరించింది.

నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సి ఉండగా.. జనవరి 31 సాయంత్రం పాటియాలా కోర్టు ఉరి అమలుపై స్టే విధించింది. తదుపది ఆదేశాలు జారీ చేసే వరకు ఉరి శిక్ష అమలు చేయొద్దని అధికారులను ఆదేశించింది.

ఉరిశిక్ష విధించొద్దంటూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను 2017 మే నెలలో సుప్రీం తిరస్కరించగానే.. డెత్ వారంట్ జారీ చేసేందుకు ఎవరూ చర్యలు తీసుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో దక్షిణ ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు గ్యాంగ్ రేప్ చేయడంతోపాటు.. ఆమె ప్రయివేట్ భాగాల్లో తుప్పుపట్టిన ఐరన్ రాడ్ దూర్చి.. చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదే ఏడాది డిసెంబర్ 29న ప్రాణాలు వదిలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.