యాప్నగరం

బస్సులో మహిళ ముందు హస్తప్రయోగం.. వ్యక్తి అరెస్ట్

బస్సులో ప్రయాణికులు ఉండగానే ఓ వ్యక్తి ఎంత అసభ్యకరంగా ప్రవర్తించాడో చూడండి.

Samayam Telugu 9 Dec 2018, 3:58 pm
ఢిల్లీలో మహిళలు ఎదుర్కొనే దారుణమైన పరిస్థితులకు మరో నిదర్శనం ఈ ఘటన. డీటీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పక్కన కూర్చున్న కిషన్ దత్ పాండే (45) అనే వ్యక్తి ఆమెను టచ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె వారించడంతో ఫ్యాంటు విప్పి.. హస్తప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలుపెట్టింది.
Samayam Telugu Untitled


తోటి ప్రయాణికులు అతడిని పట్టుకోడానికి ప్రయత్నించడంతో నడుస్తున్న బస్సు నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దౌలా కువా బస్టాండ్‌‌లో నిందితుడిని పట్టుకున్నారు. నవంబరులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని బస్సులో ప్రయాణిస్తోంది. ఆమె మహిళలకు కేటాయించిన సీటులో కూర్చోగా.. ఓ వ్యక్తి ఆమె ఎదురుగా నిలుచుని ఆమెకు మర్మాంగాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆమె ఎదురుగానే హస్త ప్రయోగం చేసుకోవడంతో ఆమె కేకలు పెట్టింది. అయితే, తోటి ప్రయాణికులు ఎవరూ ఆమెకు సాయం చేయకపోవడంతో ఆమే స్వయంగా అతడిని నెట్టేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.