యాప్నగరం

Caa Protest: జామియా అల్లర్ల కేసులో పది మంది అరెస్ట్.. వర్శిటీ విద్యార్థులే కాదు

జామియా అల్లర్ల కేసులో 10మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారంతా విద్యార్థులే కాదని చెబుతున్న పోలీసులు. వాళ్లంతా బయటి వ్యక్తులగా గుర్తించిన పోలీసులు.. వర్శిటీలో నిఘా పెంపు.

Samayam Telugu 17 Dec 2019, 12:04 pm
క్యాబ్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల కేసులో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న ఈ 10మందికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. వీరంతా విద్యార్థులే కాదని.. బయట నుంచి వచ్చిన వ్యక్తులుగా తేల్చారు. జామియా నగర్, షాహీన్ బాగ్ ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నబయటి వ్యక్తుల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
Samayam Telugu jamia.


పౌరసత్వ సవరణ చట్టాని (క్యాబ్ బిల్లు)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి, ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు ఈ నిరసనలు కొనసాగగా, ఆరు బస్సులు, నాలుగు పోలీసు వాహనాలకు నిప్పంటించారు.

ఆందోళనకారులు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారు. అలాగే ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి జామియానగర్‌ వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘర్షణలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 15మందిపై కేసులు నమోదు చేశారు.

హింసకు తాము కారణం కాదని.. కొందరు స్థానికులే బస్సులకు నిప్పంటించి గందరగోళం సృష్టించారని వారు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్దకు వేలాది మంది చేరుకుని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఆందోళనలు మథుర రోడ్‌ సహా జేఎంఐకి వెళ్లే మార్గాల్లో వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. అటు మెట్రో స్టేషన్ల మూసివేత, ఇటు ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.