యాప్నగరం

మాస్క్ ధరించకపోతే రూ.2,000 ఫైన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచనల నిర్ణయం

దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా మరోసారి కోవిడ్-19‌ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

Samayam Telugu 19 Nov 2020, 3:35 pm
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం మరో 7,400కుపైగా పాజిటివ్ కేసులు.. 131 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పరిస్థితులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశ అనంతరం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పండుగలు, వేడుకలను ఇంటి వద్దే నిర్వహించుకోవాలని సూచించారు. వచ్చే ఛట్ పూజను ఇంటి వద్దే ఎటువంటి హడావుడి లేకుండా జరుపుకోవాలని అన్నారు.
Samayam Telugu అరవింద్ కేజ్రీవాల్


ఒకవేళ, 200 మంది ఒకే చోట చేరి వేడుకలు చేసుకుంటే ఒక్కరిలో కరోనా వైరస్ ఉన్నా అందరికీ సంక్రమిస్తుందని.. నిపుణుల అభిప్రాయం ఇదేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంఖ్యలో కోవిడ్-19 వ్యాపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి.. కాబట్టి వేడుకలను రద్దుచేయడంలేదు.. కానీ, భారీగా నదులు, వాగుల వద్ద ఒకేసారి గుమిగూడటాన్ని నిషేధిస్తున్నాం.. కాబట్టి ఇంటి వద్దే వేడుకలు చేసుకోండి’ అని కేజ్రీవాల్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఢిల్లీలో కోవిడ్-19 నిబంధనలు నాలుగు రెట్లు ఉల్లంఘన జరుగుతోందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోతే రూ.2,000 జరిమానా విధిస్తామని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 7,943కు పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.