యాప్నగరం

Delhi Riots: ఐబీ కానిస్టేబుల్‌ను కొట్టి చంపి డ్రైనేజీలో విసిరేసిన అల్లరి మూక

అల్లర్లతో అట్టుకుడుతున్న ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువ ఐబీ కానిస్టేబుల్‌ను అల్లరి మూక కొట్టి చంపింది. బుల్లెట్‌తో కాల్చి అతడి మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసింది.

Samayam Telugu 26 Feb 2020, 2:40 pm
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 180 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘర్షణల అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో‌కు చెందిన ఓ యువ కానిస్టేబుల్ మృతదేహాన్ని చాంద్ బాఘ్ ప్రాంతంలో గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని 26 ఏళ్ల అంకిత్ శర్మగా గుర్తించారు. విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా.. మూక దాడి చేసి అతణ్ని చంపి మురుగు కాల్వలో వేశారని తెలుస్తోంది.
Samayam Telugu delhi ib officer


బుల్లెట్ గాయాలతో ఉన్న అతడి మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. 2017లో శర్మ ఐబీలో చేరాడని.. ఆయన డ్రైవర్‌గా శిక్షణలో ఉన్నాడని సమాచారం. ఢిల్లీ అల్లర్లలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌ను కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నారు. తన కొడుకును ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడి మద్దతుదారులు కొట్టి చంపారని ఆయన ఆరోపించారు. తీవ్రంగా కొట్టిన తర్వాత తన కొడుకుపై కాల్పులు జరిపారని రవీందర్ శర్మ పోలీసులకు తెలిపారు.

ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఢిల్లీలో ఘర్షణలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని.. ఆర్మీని రంగంలోకి దింపాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అల్లర్లకు బీజేపీనే కారణమని.. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.