యాప్నగరం

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: ఒబామా

ఇంటర్నెట్‌కు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే సత్తా ఉందని ఒబామా హెచ్చరించారు. శుక్రవారం (డిసెంబర్ 1) ఢిల్లీలో ఆయన లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్నారు.

TNN 1 Dec 2017, 3:24 pm
భారత్‌ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అని, తమది అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 1) ఢిల్లీలో ఆయన హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘లీడర్‌షిప్’ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌కు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే సత్తా ఉందని ఒబామా హెచ్చరించారు. ఇటీవల మీడియా పాత్ర ఎక్కువైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవమైన వార్తలను గుర్తించాలని, కొత్త సమాచార యుగం అవసరమని ఒబామా అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని విలువలను రోజూ ప్రచారం చేయాలని, భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని సూచించారు.
Samayam Telugu democracy under threat with internet says barack obama
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: ఒబామా


భారత్ కేవలం ఆసియాలోనే కాకుండా.. విశ్వవ్యాప్తంగా తన పాత్రను పోషించాలని ఒబామా కోరారు. మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, పేద-ధనికుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. పారిస్ వాతావరణ ఒప్పందం కోసం తాను, ప్రధాని మోదీ విశేషంగా కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

ఉగ్రవాద చర్యలు ఎలాంటి వారినైనా ఇబ్బంది పెడతాయని ఒబామా అన్నారు. ముంబై దాడుల తర్వాత తాము ఈ రకంగా ఆలోచన చేశామని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ అంతే వ్యక్తిగతంగా తనకు అభిమానమని, ఆయన దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఒబామా పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తనకు ఇష్టమే అని ఆయన తెలిపారు.

భారత్, అమెరికా కలిసి పనిచేస్తే, పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని ఒబామా అన్నారు. అంతర్జాతీయంగా ప్రజల్లో అభద్రతా భావం ఉందని, దాన్ని తొలిగిస్తేనే మానవ ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. న్యూక్లియర్ సైప్లై గ్రూప్‌లో భారత్‌ సభ్యత్వం కోసం తాము ఎంతో ప్రయత్నించామని, కానీ కొన్ని దేశాలు అడ్డుకున్నాయని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.