యాప్నగరం

చెన్నై సిల్క్స్ భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం కారణంగా పెద్ద వస్త్ర దుకాణం ‘ది చెన్నై సిల్క్స్’ భవనం సర్వనాశనమైపోయింది.

TNN 2 Jun 2017, 2:45 pm
చెన్నైలో భారీ అగ్నిప్రమాదం కారణంగా పెద్ద వస్త్ర దుకాణం ‘ది చెన్నై సిల్క్స్’ భవనం సర్వనాశనమైపోయింది. అందులో ఉన్న బట్టలు, బంగారం, వెండి వస్తువులన్నీ బుగ్గిపాలైపోయాయి. ఈ ఏడంతస్తుల భవనం కూడా సగం కూలిపోయి ప్రమాదకరంగా మారింది. మిగతా భాగం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అంతకుముందే అగ్నిప్రమాద ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో కమిటీ వేసింది. ప్రజాపనుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ జయసింగ్‌ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. ప్రమాదం జరిగాక భవనం కూలిపోతూ ఉండడంతో... చుట్టుపక్కల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. దగ్గరగా ఉన్న ఇతర దుకాణాలను కూడా మూసివేయించారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి వేరే దారిలో పంపిస్తున్నారు. కాగా భవనాన్ని పూర్తిగా కూల్చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రత్యేక యంత్రాల ద్వారా భవనం కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందుకు ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నారు.
Samayam Telugu demolition of chennai silks building begins
చెన్నై సిల్క్స్ భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు




బుధవారం వేకువజామున చెలరేగిన మంటలు రాత్రి దాకా కొనసాగాయి. 400కిలోల బంగారం కాలి బూడిదైంది. రెండు వేల కిలో వెండి బుగ్గిపాలైంది. భద్రపరిచిన దుస్తులు కూడా మసైపోయాయి. మొత్తం 300 కోట్ల నష్టం వాటిల్లింది. గురువారం మధ్యాహ్నం ఏడో అంతస్తు నుంచి రెండో అంతస్తు దాకా భవనం కూలిపోయింది. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో అంతా భయపడ్డారు. మిగతా భాగం కూడా ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చనే అనుమానంతో... ముందస్తుగా కూల్చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.