యాప్నగరం

నోట్ల రద్దు దేశ ఆర్థికవృద్ధిపై అణు దాడి: సామ్నా

నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థికవృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ అణు బాంబు ప్రయోగించారని శివసేన అధికార పత్రిక సామ్నా విమర్శించింది.

TNN 19 Jan 2017, 3:14 pm
నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థికవృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ అణు బాంబు ప్రయోగించారని శివసేన అధికార పత్రిక సామ్నా విమర్శించింది. అంతే కాకుండా పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని దేశాన్ని మోసం చేశారంటూ దుయ్యబట్టింది. సామ్నా పత్రిక బుధవారం సంపాదకీయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే మోడీ ఎవరి మాటలు వినే ఆలోచనలో లేరని, కేంద్ర క్యాబినెట్ కూడా మూగ, చెవుడున్న చిలకల్లా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
Samayam Telugu demonetisation like dropping nuclear bomb on economy saamna
నోట్ల రద్దు దేశ ఆర్థికవృద్ధిపై అణు దాడి: సామ్నా


ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కూడా కడిగి పారేసింది. నోట్ల రద్దు సమస్యలు మూడు నెలల్లో పరిష్కారం కావని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కూడా ఇందులో పొందుపరిచింది. రూ.1,000, 500 నోట్ల రద్దుతో దేశంలోని 50 శాతం చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొంది.

పెద్ద నోట్ల రద్దుకు ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహారాష్ట్రలో 30 లక్షలు మంది మాత్రమే ఉండేవారి, కేంద్రం నిర్ణయం తర్వాత వీరి సంఖ్య 85 లక్షలకు చేరుకుందని తెలిపింది. సుమారు 50 లక్షల మంది కార్మికులు అదనంగా ఎం‌ఎన్ఆర్ఈజీఏలో చేరారని పేర్కొంది. అసోచోమ్ నివేదిక ప్రకారం నోట్ల రద్దుతో 40 లక్షల మంది ఉపాది కోల్పోయారని సామ్నా వ్యాఖ్యానించింది.

జిల్లా సహాకార బ్యాంకుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానిస్తూ రద్దు చేసిన నోట్ల మార్పిడిని కేంద్రం నిలిపివేయడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలిపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సహకార రంగం నిర్వీర్యం అయ్యిందని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.