యాప్నగరం

ATMs వద్ద క్యూ, జనంతో మాట్లాడిన రాహుల్

పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ..ఢిల్లీలోని పలు ఏరియాల్లోని ఏటీఎ సెంటర్ల దగ్గర ఆగారు.

Samayam Telugu 21 Nov 2016, 10:53 am
పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ..ఢిల్లీలోని పలు ఏరియాల్లోని ఏటీఎ సెంటర్ల దగ్గర ఆగారు. అర్థరాత్రి నుంచి ఏటీఎంల దగ్గరే పడిగాపులుకాస్తున్న జనంతో మాట్లాడారు.
Samayam Telugu demonetisation rahul interact with people at atms in delhi
ATMs వద్ద క్యూ, జనంతో మాట్లాడిన రాహుల్


జాహంగీర్ పురి, ఇంద్రలోక్, జకీరా వంటి ప్రాంతాల్లోని ఏటీఎంల దగ్గర క్యూ కట్టిన జనంతో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా జనం కష్టాలు రాహుల్ తో పంచుకున్నారు.

ఏటీఎంలలో నగదు సరిపడా నిల్వ ఉంచడం లేదని, తమదాకా వచ్చేసరికి ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయని ప్రజలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రజలు పడుతున్న బాధల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.

Video: Congress VP Rahul Gandhi outside an ATM in Delhi. Talks to them about problems faced due to #demonetization @htTweets @htdelhi pic.twitter.com/XBIGTOdptM— Abhinav Rajput (@Abhinavstweet) November 21, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.