యాప్నగరం

నోట్ల రద్దు: మళ్లీ భగ్గుమన్న మమతక్క

నరేంద్రమోడి సర్కారుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు ఫైర్ అయ్యారు.

TNN 23 Nov 2016, 10:34 am
నరేంద్రమోడి సర్కారుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు ఫైర్ అయ్యారు. మోడీ నిర్ణయం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో 68మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వాల నిర్ణయాలు సామాన్యులకు లబ్దిని చేకూర్చాలేకానీ వారి ప్రాణాలకు ముప్పుగా వాటిల్లకూడదని ఆమె తన ట్విట్టరు ఖాతాలో ట్వీట్ చేశారు. మోడి తన నియంతృత్వ పోకడలను కట్టిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాణాలు ఎవరివి అయినా ఒకటే అని వాటిని మనం కాపాడాల్సి ఉందన్నారు. తన నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మోడీ ఇలాగే ముందుకెళ్తే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.