యాప్నగరం

పశువుల కాపరి ఖాతాలో రూ.40లక్షలు

పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లకుబేరులు పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో తమ అక్రమ సొమ్మును డిపాజిట్ చేస్తున్నారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

Samayam Telugu 4 Dec 2016, 10:49 am
పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లకుబేరులు పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో తమ అక్రమ సొమ్మును డిపాజిట్ చేస్తున్నారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. బిహార్ లోని షియోగంజ్-నెహ్రూ నగర్ లో నివసించే సితార దేవీ అజయ్ యాదవ్ దంపతులు నిరుపేదలు. ఇల్లు, మూడు ఆవులు తప్ప తమకంటూ ఆస్తులు లేవు. అలాంటిది సితార దేవీ జన్ ధన్ యోజన కింద గతేడాది తీసుకున్న బ్యాంకు ఖాతాలో నోట్లరద్దు తర్వాత రూ.40లక్షలు డిపాజిట్ అయ్యాయి.
Samayam Telugu demonetization a jan dhan account got rs 40 lakh after note ban
పశువుల కాపరి ఖాతాలో రూ.40లక్షలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్లరద్దు ప్రకటన చేసిన నవంబర్ 8 తర్వాత నాలుగు విడతలుగా సితార దేవీ అకౌంట్లో అంత పెద్దమొత్తంలో డబ్బుల జమకావడంపై బ్యాంకు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

దీంతో సితార దేవీ ఆమె భర్త అజయ్ యాదవ్ లను బ్యాంకు అధికారులు, ఐటీ అధికారులు పిలిచి విచారించారు. అయితే అంత పెద్దమొత్తంలో తమ ఖాతాలో డిపాజిట్ అయ్యిందని తెలుసుకున్న..అజయ్...తొలుత పాలమ్మగా వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేశానని చెప్పాడు. కానీ అతను చెప్పింది నమ్మశక్యంగా లేకపోవడంతో అధికారులు సితార జన్ ధన్ ఖాతాను స్తంభింపజేశారు.

పన్నులు తప్పించుకోవడానికే అక్రమంగా సంపాదించినవారే సితార దేవీ ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు భావిస్తున్న అధికారులు..అసలైన డిపాజిటర్ ను కనుగొనే పనిలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.