యాప్నగరం

నోట్లరద్దు: నోట్ల కొరతకు కారణం అదే!

నోట్ల రద్దుతో తలెత్తే పరిణామాలను ముందస్తుగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును జాతీయ బ్యాంకింగ్ అధికారుల సంఘం (ఎఐబిఓఎ) తప్పుపట్టింది.

TNN 3 Dec 2016, 8:54 am
నోట్ల రద్దుతో తలెత్తే పరిణామాలను ముందస్తుగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును జాతీయ బ్యాంకింగ్ అధికారుల సంఘం (ఎఐబిఓఎ) తప్పుపట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను చెప్పుచేతల్లో ఉంచుకుని దిశా నిర్ధేశం చేయాల్సిన రిజర్వ్ బ్యాంక్ అందుకు తగిన రీతిలో వ్యవహరించలేక ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ తీవ్రంగా హైదరాబాదులో విలేకరుల సమావేశంలో విమర్శించారు. డబ్బు పంపిణీ విషయంలో కూడా ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ఐసీఐసీఐ, ఎస్బీఐ లకు పుష్కలంగా డబ్బు అందిస్తున్న ఆర్బీఐ మిగిలిన బ్యాంకులకు సరిపడా కరెన్సీని పంపిణి చేయడం లేదని ఆరోపించారు.
Samayam Telugu demonetization aiboa hits at out rbi for its mindless decisions
నోట్లరద్దు: నోట్ల కొరతకు కారణం అదే!


ఆర్బీఐ తీరు వల్ల బ్యాంకుల సిబ్బంది పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. అటు ప్రజలు, ఇటు బ్యాంకింగ్ సిబ్బంది పడుతున్న కష్టాలకు కారణం ఆర్బీఐ నిర్లక్ష్యమేనని వ్యాఖ్యానించారు. వివక్షకు తావులేకుండా బ్యాంకులన్నింటికి నగదు సరఫరా చేస్తే సమస్యలుండవన్నారు. ప్రస్తుతం దేశంలో పేరుకు రెండు లక్షల వరకు ఏటీఎంలున్నప్పటికీ వాటిల్లోకేవలం 35వేల ఏటీఎంలే పనిచేస్తున్నాయని, పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలకు దేశ ప్రజలు ఇప్పటికిప్పుడు సంసిద్ధంగా లేరని చెప్పారు. వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను సరిదిద్దిన తరువాత సంస్కరణలకు తెరతీయాలని, అలాకాకుండా అనాలోచితంగా ముందుకు వెళ్తే ఇప్పటికన్నా ముందు రోజుల్లో మరిన్ని విపరిణామాలు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.