యాప్నగరం

నోట్లరద్దు: నొప్పి కొన్నాళ్లే, లాభాలు శాశ్వతం

పెద్దనోట్ల రద్దు తాలుకూ నొప్పి (ఇబ్బందులు) కొన్నాళ్లేనని...లాభాలు మాత్రం శాశ్వతమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.

TNN 24 Dec 2016, 2:49 pm
పెద్దనోట్ల రద్దు తాలుకూ నొప్పి (ఇబ్బందులు) కొన్నాళ్లేనని...లాభాలు మాత్రం శాశ్వతమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ లో నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ ప్రాంగణాన్ని మోదీ ప్రారంభించారు.
Samayam Telugu demonetization brings long time benefits says modi
నోట్లరద్దు: నొప్పి కొన్నాళ్లే, లాభాలు శాశ్వతం


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కుంటుపడ్డ ఆర్ధికాభివృద్ధి తమ హయంలో పరుగులుపెడుతోందని అన్నారు. తమ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పాలసీలు రూపొందచబోమని..దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిని సాధించేందుకే కృషి చేస్తామని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ది చెందిన దేశాల సరసన నిలపాలన్నదే తన ధ్యేయమని మోదీ తెలిపారు.

2012-13 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ఘోరంగా పడిపోయిందని, రూపాయి విలువ పడిపోవడం (ద్రవ్యోల్బణం), ఆర్థికమాంధ్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పిన మోదీ...ప్రస్తుతం వృద్ధిరేటు శరవేంగా పెరుగుతోందన్నారు.

సెక్యూరిటీస్ అండ్ ఎక్సెంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) సేవలు ఎంతో బాగున్నాయని శ్లాఘించారు. ఇటీవల కేంద్రం ప్రారంభించిన ఈ-నామ్ పథకం ద్వారా వ్యవసాయ మార్కెట్, పెట్టుబడులను ప్రొత్సహించాలని సూచించారు.

మోదీ ఇవాళ ముంబైలోని అరేబియా సముద్రం ఒడ్డున నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్థూపం, కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.