యాప్నగరం

అది ‘బ్లాక్ మనీ’ మోహన్ పరిపాలన: జైట్లీ

గత యూపీఏ పదేళ్ల పాలనలోనే దేశంలో అత్యధికంగా నల్లధనం బయటపడిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.

TNN 24 Nov 2016, 5:37 pm
గత యూపీఏ పదేళ్ల పాలనలోనే దేశంలో అత్యధికంగా నల్లధనం బయటపడిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. తమ పాలనలో వెల్లడైన నల్లధనం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగనీయడం లేదని ఆయన అన్నారు.
Samayam Telugu demonetization highest black money found in manmohan regime says arun jaitly
అది ‘బ్లాక్ మనీ’ మోహన్ పరిపాలన: జైట్లీ


‘2004-2014 మధ్యకాలంలోనే అత్యధిక నల్లధనం బయపడింది. ఎవరి పారిపాలనలోనైతే అత్యధిక నల్లధనం వెల్లడి, కుంభకోణాలు జరిగాయో అవి మరిచిపోయి..బ్లాక్ మనీపై యుద్ధం చేస్తున్న మమల్ని తప్పుబడుతున్నారు’ అని జైట్లీ విమర్శించారు.

గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోట్ల రద్దుపై జరిగిన చర్చలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. నోట్ల రద్దు ముసుగులో దోచేస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల 2శాతం జీడీపీ పడిపోతుందని అన్నారు. నోట్ల రద్దుతో చట్టరీత్యా ప్రభుత్వం దోపిడి చేస్తుందని మన్మోహన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

మన్మోహన్ వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ మండిపడ్డారు. మన్మోహన్ హయంలోనే అవినీతి, నల్లధనం అధికంగా వెలుగు చూసిందని అన్నారు.

సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా..ప్రతిపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగానే సభను ముందుకు సాగనీయడం లేదని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.