యాప్నగరం

నోట్ల రద్దు: రాజకీయ పార్టీలకు మినహాయింపు లేదు -అరుణ్ జైట్లీ

ఈనెల 30వ తేదీ వరకు విధించిన గడువులోగా రాజకీయ పార్టీలు తమ వద్ద వున్న పాత పెద్ద నోట్లని పార్టీకి చెందిన బ్యాంకు ఎకౌంట్లలో...

TNN 18 Dec 2016, 3:04 am
ఈనెల 30వ తేదీ వరకు విధించిన గడువులోగా రాజకీయ పార్టీలు తమ వద్ద వున్న పాత పెద్ద నోట్లని పార్టీకి చెందిన బ్యాంకు ఎకౌంట్లలో డిపాజిట్ చేసి పన్ను మినహాయింపు పొందవచ్చన్నట్టుగా కేంద్రం ఓ ప్రకటన చేసిందంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంపై ఆర్థిఖ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇన్‌కమ్ టాక్స్ చట్టం నియమ నిబంధలను కాదని రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపు ఇవ్వడం ఏంటంటూ విమర్శలు వ్యక్తమవడంపై అరుణ్ జైట్లీ ఓ ప్రకటన విడుదల చేశారు. పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు అనంతరం కానీ లేదా డిసెంబర్ 15వ తేదీన అమలులోకి వచ్చిన ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2016లోని 2వ సవరణలో కానీ రాజకీయ పార్టీలకు కొత్తగా ఏ మినహాయింపు ఇవ్వలేదని అరుణ్ జైట్లీ ఈ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu demonetization no exemption in income tax laws for political parties arun jaitley
నోట్ల రద్దు: రాజకీయ పార్టీలకు మినహాయింపు లేదు -అరుణ్ జైట్లీ


1961 ఐటీ చట్టంలోని 13A సెక్షన్ ప్రకారం రాజకీయ పార్టీలు కూడా ఆడిట్ చేసిన ఎకౌంట్స్, ఆదాయ-వ్యయాల వివరాలు, బ్యాలెన్స్ షీట్ వంటివి సమర్పించాల్సి వుంటుంది. నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీలేవీ పాత రూ.500, రూ.1,000 నోట్లని విరాళంగా స్వీకరించరాదు. ఒకవేళ ఏదైన రాజకీయ పార్టీ అటువంటి పని చేస్తే, అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని జైట్లీ స్పష్టంచేశారు. తమ వద్ద వున్న పాత నోట్లని సాధారణ ప్రజానీకం మాదిరిగానే రాజకీయ పార్టీలు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా మొత్తానికి సంబంధించిన లెక్కలు, ఆధారాల్ని చూపించాల్సి వుంటుంది. అంతేకాకుండా ఐటీ చట్టం ప్రకారం రూ.20,000లకు మించిన విరాళాలు ఇచ్చినవారి వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని జైట్లీ ప్రకటించారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.