యాప్నగరం

పాత నోట్లు చెల్లేది ఇంకా రెండు రోజులే

ఇంకా పాత అయిదువందల నోట్లు చెల్లుబాటయ్యేది కేవలం రెండు రోజులే.

TNN 8 Dec 2016, 7:05 pm
ఇంకా పాత అయిదువందల నోట్లు చెల్లుబాటయ్యేది కేవలం రెండు రోజులే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాక... రూ.500నోటును రైల్వేలు, బస్సులు, మెట్రోలు, పెట్రోల్ బంకులు ఇలా కొన్ని చోట్ల డిసెంబర్ 15 వరకు తీసుకుంటారన్న వెసులుబాటును కల్పించింది కేంద్రం. డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పింది. అయితే పాత రూ.500 నోట్లను రైల్వేలు, బస్సులు, మెట్రోలు చోట్లలో డిసెంబర్ 10 వరకే తీసుకుంటారని తాజాగా ప్రకటించింది. అంటే కేవలం రెండు రోజులే సమయం ఉంది. ఈ లోపే బస్సు, ట్రైన్ల టిక్కెట్ల కోసం పాత రూ.500 నోట్లను వాడేయడం మంచిది. డిసెంబర్ 3 నుంచే పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ స్టేషన్లలో, విమాన టిక్కెట కొనుగోళ్లలో రద్దు చేశారు.
Samayam Telugu demonetization old rs 500 notes wont be accept after december 10
పాత నోట్లు చెల్లేది ఇంకా రెండు రోజులే


ఆర్‌బీఐ కొత్త రూ.100, రూ.50, రూ.20 నోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. పాత వంద, యాభై, ఇరవై నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.