యాప్నగరం

మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుపై రాందేవ్ అసంతృప్తి

ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు పథకంపై మోడీ మద్దతుదారుల్లో ఒకరిగా పేరొందిన యోగా గురు బాబా రాందేవ్..

Samayam Telugu 18 Dec 2016, 4:47 am
ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు పథకంపై మోడీ మద్దతుదారుల్లో ఒకరిగా పేరొందిన యోగా గురు బాబా రాందేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన అసలు సమస్య నగదు సరఫరా కాదు. లంచగొండి, అవినీతిపరులైన కొంతమంది బ్యాంకు అధికారుల చేతికి కొత్త క్యాష్ చేరడమే ఈ పథకాన్ని అవినీతిపాలుచేసిందని రాందేవ్ అభిప్రాయపడ్డారు.
Samayam Telugu demonetization ramdev baba turns on modi says currency ban will expose rs 3 5 lakh cr scam
మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుపై రాందేవ్ అసంతృప్తి


'నోట్ల రద్దు కారణంగా అవినీతికి తెరలేపిన బ్యాంకర్లు దాదాపు రూ. 3-5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ఉంటారు. బ్యాంకర్లు ఇంత అవినీతికి పాల్పడుతారని బహుశా.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఊహించి ఉండకపోవచ్చు' అని విస్మయం వ్యక్తంచేశారు రాందేవ్. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై బ్యాంకర్లు ప్రధానిని తప్పుదోవపట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసిన రాందేవ్ బాబా... నోట్ల రద్దు పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తే బాగుండేది అని అన్నారు. ప్రముఖ డిజిటల్ మీడియా హౌజ్, 'ది క్వింట్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.