యాప్నగరం

భారీ విదేశీ కరెన్సీతో పట్టుబడిన హైదరాబాదీలు!

భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గరు హైదరాబాదీలు ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుధవారం పట్టుబడ్డారు.

TNN 28 Dec 2016, 2:48 pm
భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గరు హైదరాబాదీలు ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుధవారం పట్టుబడ్డారు. అక్రమంగా దేశం దాటిస్తున్న రూ. 69 లక్షల సొమ్మును రెండు కేసుల్లో ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ. 25 లక్షలు కొత్త 2వేల రూపాయల నోట్లు కావడం విశేషం. రెండు కేసుల్లో మొత్తం నలుగురు వ్యక్తలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu demonetization rs 69 lakh seized from mumbai airport four arrested
భారీ విదేశీ కరెన్సీతో పట్టుబడిన హైదరాబాదీలు!


హైదరాబాద్‌కు చెందిన షేక్ వహీద్ అలీ, మహమ్మద్ సోహైల్, షేక్ పాషా అనే ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రూ. 43 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో దేశం దాటించేందుకు ప్రయత్నించారు. అయితే బ్యాగేజ్ చెకింగ్‌లో వీరు అధికారులకు పట్టుబడ్డారు. వీరిదగ్గర నుంచి 1,39,000 సౌదీ రియాలు, 5,65,000 యూఏఈ దిరాంలు, 14,000 ఆస్ట్రేలియన్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 43.97 లక్షలు. ఈ సొమ్మును న్యూస్ పేపర్లలో చుట్టి బ్యాగులలో కుక్కారు. మరోవైపు ఇంకో కేసులో రూ. 25 లక్షల అక్రమ సొమ్మును కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.