యాప్నగరం

మధ్యంతరం తప్పేలా లేదు.. కార్యకర్తలు సిద్ధం కండి: దేవెగౌడ

జేడీఎస్‌లో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేవెగౌడ బుధవారం ఆయనతో సమావేశమై చర్చించారు.

Samayam Telugu 20 Jun 2019, 10:01 am

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు తప్పేలా లేవు
  • జేడీఎస్ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలి
  • దేవెగౌడ పిలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu dewe
కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు తప్పేలా లేవని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలిచేలా కనిపించడం ఆయన పార్టీ కార్యకర్తల దగ్గర ప్రస్తావించారు. మధ్యంతర ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జేడీఎస్‌లో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేవెగౌడ బుధవారం ఆయనతో సమావేశమై చర్చించారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగోలేదని, ఇలాంటి సమయంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సరికాదని విశ్వనాథ్‌కు సర్దిచెప్పారు. మరికొన్ని రోజుల్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎవరికి వారు కీలక పదవులకు రాజీనామా చేయడం సరికాదని వారించారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ బీజేపీ అభ్యర్థి బసవరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.