యాప్నగరం

ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికి వాడ.. ముంబై ధారవిలో కరోనా తొలి మరణం

Coronavirus in Mumbai | ముంబైలోని ధారవి ప్రాంతంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కోవిడ్ సోకిందని తేలిన రోజే 56 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడు నివసించిన ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

Samayam Telugu 1 Apr 2020, 11:16 pm
ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో తొలి కరోనా మరణం సంభవించింది. 56 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారిన ప్రాణాలు కోల్పోయాడు. సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం అతడు చనిపోగా.. అంతకు ముందే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జ్వరం రావడంతో అతడు మార్చి 23న స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరకు చెకప్‌ కోసం వెళ్లాడు. శ్వాస సంబంధ సమస్యలతో మార్చి 26న సియాన్ హాస్పిటల్‌లో చేరాడు.
Samayam Telugu covid deaths


వస్త్ర దుకాణం నడుపుతూ.. ధారవిలోని ఎస్ఆర్ఏ బిల్డింగ్‌లో నివసించే ఆయనకు ట్రావెల్ హిస్టరీ లేదు. కరోనాతో వ్యక్తి మరణించడంతో.. అతడి కుటుంబ సభ్యులకు కూడా బీఎంసీ పరీక్షలు నిర్వహిస్తోంది. అతడు నివసించిన బిల్డింగ్ మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి.. పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. ఆయన నివసించిన బిల్డింగ్‌లో 308 ఫ్లాట్స్, 91 షాపులు ఉన్నాయి.

ధారవి ప్రాంతంలో 5 చ.కి.మీ విస్తీర్ణంలోనే పది లక్షల మంది ప్రజలు నివసిస్తన్నారని అంచనా. అంతటి జనసాంద్రత ఉన్న ప్రాంతంలో కోవిడ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 335కు చేరగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.