యాప్నగరం

వారిని చూస్తే కన్నీళ్లు ఆగలేదు.. జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ భావోద్వేగం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో సోమవారం భారీ సభను ఏర్పాటు చేశారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు నేతలు. దట్టంగా మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ ప్రసంగం కొనసాగింది. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తాను టీషర్ట్‌తో ఎందుకు నడిచానో తెలిపారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 Jan 2023, 4:21 pm

ప్రధానాంశాలు:

  • శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సభ
  • భారీగా ముంచుకురవడంతో సభకు ఆటంకం
  • పార్టీ, దేశం కోసం యాత్ర చేయలేదన్న రాహుల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రాహుల్ గాంధీ
ఓవైపు మంచు వర్షం, మరోవైపు గడ్డకట్టే చలి.. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు సభ శ్రీనగర్‌లో జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కశ్మీరీ అగ్రనేతలు ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. సంఘీభావం తెలియజేశారు. శ్రీనగర్ స్టేడియంలో తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జోరుగా మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ (Rahul Gandhi)తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను ఈ యాత్రను నా కోసం లేదా కాంగ్రెస్ కోసం చేయలేదు.. దేశ ప్రజల కోసం చేయలేదు.. ఈ దేశపు పునాదిని నాశనం చేయాలనుకునే భావజాలానికి వ్యతిరేకంగా నిలబడడమే మా లక్ష్యం.. ప్రజల సహకారం చూసి నాకు కన్నీరు వచ్చింది. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా.. చలిని సైతం లెక్కచేయకుండా ప్రజలు హాజరయ్యారు.. వారి సహకారం లేకుండా ఏ పనీ సాకారం కాదు..

జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు, మహిళలు తమ బాధలు, సమస్యలను నాతో పంచుకున్నారు. ఈ పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.. ప్రజల దీనస్థితి చూసి టీషర్టుతోనే యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.. పాద యాత్రలో భాగంగా ఓ రోజు నలుగురు చిన్నారుల నా దగ్గరకు వచ్చారు.. వారు యాచకులు. వారి ఒంటిపై దుస్తులు కూడా లేవు. వారు చలికి వణికిపోతున్నారు. నాకు తెలిసి వారికి తగిన ఆహారం కూడా ఉండదు. వారు జాకెట్స్‌, స్వెట్టర్లు వేసుకోలేదు. అప్పుడే అనుకున్నా నేను కూడా వేసుకోకూడదని’ అని వెల్లడించారు.

అలాగే కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబరు 7న మొదలైన భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల మీదుగా కశ్మీర్‌ వరకు సాగింది.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.