యాప్నగరం

ఆల్ టైం హై.. హీటెక్కిస్తోన్న డీజిల్ ధర!

రోజూవారీ ధరల సమీక్ష, ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయడం పుణ్యమా అని పెట్రోలియం, డీజిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.

TNN 3 Oct 2017, 11:11 am
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల సెగ సామాన్యుడికి తాకుతోంది. దీపావళి నాటికి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రి గతంలో ప్రకటించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా డీజిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో డీజిల్ ధర ఆల్ టైం హై స్థాయికి చేరింది. సోమవారం దేశ రాజధాని నగరంలో లీటర్ డీజిల్ ధర రూ. 59.07గా నమోదైంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2002 నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం.
Samayam Telugu diesel prices soar to all time high in delhi
ఆల్ టైం హై.. హీటెక్కిస్తోన్న డీజిల్ ధర!


ఢిల్లీలో మాత్రమే కాకుండా ఇతర నగరాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. కోల్‌కతాలో డీజిల్ ధర మూడేళ్ల గరిష్టానికి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 2014 ఆగష్టు తర్వాత భారీ స్థాయిలో పెరిగింది. సోమవారం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.94కు చేరింది. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. స్థానిక పన్నుల కారణంగా రాష్ట్రాన్ని బట్టి పెట్రోలియం ధరలు మారుతున్నాయి.

జూలై 1 నాటితో పోలిస్తే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 7.74 పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు రూ. 5.74 మేర ఎగబాకింది. అంతర్జాతీయ ధరల్లో పెరుగుదల, హరికేన్ల ప్రభావం కారణంగా అమెరికా రిఫైనరీలు మూతపడటం ఈ పరిస్థితికి కారణమైంది. బ్యారెల్ క్రూడాయిల్ ధర సెప్టెంబర్ 1-25 తేదీల మధ్య 12 శాతం పెరిగి 59 డాలర్లకు చేరింది. కానీ సోమవారం మళ్లీ 56 డాలర్లకు పడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.