యాప్నగరం

నేటి నుంచే డిజిటల్ చెల్లింపులకు నగదు ప్రోత్సాహకాలు

అవినీతిని అరికట్టి, నల్లధనంకు చెక్ పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం అందులో భాగంగా తీసుకువచ్చిన కొత్త లక్కీ...

TNN 25 Dec 2016, 6:11 am
అవినీతిని అరికట్టి, నల్లధనంకు చెక్ పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం అందులో భాగంగా తీసుకువచ్చిన కొత్త లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన్ స్కీమ్ నేటి నుంచే ప్రారంభం కానుంది అని నీతి ఆయోగ్ స్పష్టంచేసింది. ఈ సరికొత్త కార్యక్రమాన్ని 100 రోజుల్లో 100 నగరాలకి విస్తరించనున్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది. లక్కీ గ్రాహాక్ యోజన కింద తొలి డ్రాను గెలుచుకునే వినియోగదారులకి 100 రోజులపాటు రోజుకి రూ.1000 నుంచి 15000 వరకు క్యాష్ బ్యాక్ అందుకోనున్నారు. మొదటగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ప్రారంభం కానున్న ఈ పథకంపై అవగాహన కల్పించేందుకుగాను రానున్న 100 రోజుల్లో దేశవ్యాప్తంగా 100 వేర్వేరు నగరాలకి విస్తరించనున్నట్టు నీతి ఆయోగ్ ప్రకటన పేర్కొంది.
Samayam Telugu digital payments government to announce awards through lucky draws from today
నేటి నుంచే డిజిటల్ చెల్లింపులకు నగదు ప్రోత్సాహకాలు


రూపే కార్డ్స్, ఏఈపీఎస్, యూపీఐ యాప్స్, యూఎస్ఎస్‌డీ పద్ధతుల్లో డిజిటల్ చెల్లింపులు చేసేవారికి నగదు ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదాల్చుకున్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు ఈ పథకం ప్రారంభ సూచకంగా ఢిల్లీలో తొలి లక్కీ డ్రా కాంపీటీషన్ నిర్వహించనున్నారు. లక్కీ గ్రాహక్ యోజన పథకం కింద రోజువారి డ్రా, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకం కింద వారానికి ఓసారి ఈ డ్రా తీయనున్నారు. 2017, ఏప్రిల్ 14న రూ.1 కోటి బంపర్ ఆఫర్‌ని అందించే మెగా డ్రా తీయనున్నారు. ఆ తర్వాత పథకంను కొనసాగించాలా లేదా అనే నిర్ణయంపై కేంద్రం సమీక్ష చేపట్టనుంది.

ఇప్పటికే విస్కృతస్థాయిలో డిజిటల్ చెల్లింపుల నిర్వహణను గణనీయంగా పెంచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్డుల పంపిణీ, పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) మెషిన్లను పంపిణీ చేయాల్సిందిగా కేంద్రం బ్యాంకింగ్ సంస్థలకి సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.